News June 27, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News October 12, 2024

విజయవాడ: శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం విశిష్టత

image

కనకదుర్గమ్మ అమ్మవారు శనివారం విజయ దశమి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుందని పండితులు తెలిపారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా తనను కొలిచిన భక్తులకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తుందన్నారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజేశ్వరి దేవి అధిష్టాన దేవత అని పండితులు చెబుతారు.

News October 12, 2024

ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు

image

ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 113 మద్యం షాపుల కోసం 5,787 అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ప్రతి షాపునకు సగటున 51 దరఖాస్తులు దాఖలైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ నెల 12,13వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం 14వ తేదీన జిల్లా అధికారుల సమక్షంలో డ్రా తీసి మద్యం షాపులను కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.

News October 12, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 వరకు పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 12,14,15,16,17 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 12,13,15,16,17 తేదీల్లో CHE-BZA(నం.07216) రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.