News August 27, 2024
కృష్ణా: ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07165 HYB- CTC ట్రైన్‌ను మంగళవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు, నం. 07166 CTC- HYB ట్రైన్‌ను బుధవారం నుంచి సెప్టెంబర్ 18 వరకు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News October 28, 2025
కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.
News October 28, 2025
కృష్ణా: నేడు సినిమా థియేటర్లు మూసివేత

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజు జిల్లాలోని అన్ని సినిమా హాల్స్‌ను మూసి వేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి సినిమా ప్రదర్శనలు వేయకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు.
News October 27, 2025
కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.


