News April 1, 2025

కృష్ణా: ప్రయాణికులకు అలర్ట్.. స్టాప్ తొలగించిన రైల్వే

image

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు మహబూబాబాద్(TG)లో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. మే 24 నుంచి 28 వరకు నం.12749 మచిలీపట్నం-బీదర్‌ SF ఎక్స్‌ప్రెస్, నం.12709 గూడూరు-సికింద్రాబాద్ సింహపురి SF, నం.12759 తాంబరం-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లు మహబూబాబాద్‌లో ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News April 4, 2025

తిరువూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News April 4, 2025

జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. 

News April 3, 2025

వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్ 

image

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.    

error: Content is protected !!