News July 27, 2024
కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఉమ్మడి జిల్లా మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17015/17016 విశాఖ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 2 GEN కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి 4 GEN కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17016 ట్రైన్‌ను నవంబర్ 14 నుంచి, 17015 ట్రైన్‌ను నవంబర్ 16 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.
Similar News
News November 29, 2025
నేడే కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో వివిధ అంశాలు, ఎంజెండాలపై చర్చ ఉంటుందని చెప్పారు.
News November 29, 2025
కృష్ణా: NMMS పరీక్షల హాల్ టికెట్లపై Update

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకులు కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.inలో పొందుపరిచినట్లు DEO రామారావు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ U-DISE కోడ్ ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.


