News August 1, 2024
కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే
విజయవాడ మీదుగా భువనేశ్వర్, తిరుపతి మధ్య ప్రయాణించే 2 రైళ్లకు అదనంగా 1 జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22871/22872 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు 1 అదనపు జనరల్ కోచ్ జత చేస్తున్నామన్నారు. నం.22871 రైలును ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు, నం.22872 రైలును ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 30 వరకు అదనపు జనరల్ కోచ్‌తో నడుపుతామన్నారు.
Similar News
News October 7, 2024
లక్ష్యాలు అధిగమించి మంచి పేరు తీసుకురండి: కలెక్టర్
ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో ప్రతిరోజు లేదా 2రోజులకు ఒకసారి తప్పనిసరిగా వారి కార్యకలాపాలను సమీక్షించు కోవాలన్నారు.
News October 7, 2024
కృష్ణా: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 7, 2024
8న విజయవాడలో జాబ్ మేళా
విజయవాడ పట్టణ పరిధిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీ శిక్షణా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 10 నుంచి పీజీ వరకు చదివి 18-35 సంవత్సరాలలోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి రూ.10 నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందన్నారు.