News May 18, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్)కు స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం. 06077 ట్రైన్‌ను జూన్ 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News December 9, 2024

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుటుంబ సభ్యుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసుల వివరాల మేరకు.. ఓ బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. వరుసకు బాబాయ్ కొడుకు అయినా కార్తీక్ అనే యువకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News December 9, 2024

విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

image

గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 10లోపు https://aaiclas.aero/career వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపికైన వారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30వేల వేతనం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

News December 9, 2024

అమెరికాలో స్టూడెంట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్‌గా విజయవాడ కుర్రాడు 

image

‘యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా స్టూడెంట్‌ గవర్నమెంట్‌’ ‍ప్రెసిడెంట్‌గా విజయవాడకు చెందిన గొట్టిపాటి సూర్యకాంత్‌ ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అమెరికాలో సీఎస్‌సీ అండర్‌ గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్న గొట్టిపాటి ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడాకు చెందిన 3 క్యాంపస్‌లకు సంబంధించి 60 వేల విద్యార్థులకు మన విజయవాడ వాసి ప్రతినిధిగా ఎన్నికవ్వడం విశేషం.