News July 6, 2024
కృష్ణా: ప్రేమ వ్యవహారంతో.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కానూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆజాద్ (23) అస్సాం రాష్ట్రం ననత్బస్తి పట్టణ నివాసి. ఇతని కుటుంబం మూడేళ్ల క్రితం కానూరు వచ్చి స్థిరపడ్డారు. హుస్సేన్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని ప్రేమించాడు. గుర్తించిన తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


