News January 7, 2025
కృష్ణా: ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిన ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం అనంతరం అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. మెరిట్ లిస్ట్ పూర్తి వివరాలకు https://ntr.ap.gov.in/notice_category/recruitment/ చూడవచ్చని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News January 5, 2026
కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

News January 4, 2026
గన్నవరంలో రేపు సబ్‌స్టేషన్ ప్రారంభం.. మంత్రుల రాక

AP ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 132/33 KV గన్నవరం విమానాశ్రయ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం ప్రారంభించనున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోటును అధిగమించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు వాసంశెట్టి, కొల్లు, గన్నవరం MLA యార్లగడ్డ పాల్గొననున్నారు.