News October 23, 2024
కృష్ణా: ఫీజు చెల్లింపుకు రేపే చివరి తేదీ
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
Similar News
News November 27, 2024
కొనకళ్ల కోడలి చీర మిస్సింగ్.. నోటీసుల జారీ
మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడారు. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.
News November 27, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?
ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కనకమేడల రవీంద్ర రాజ్యసభ ఎంపీగా పనిచేయగా.. ఆయన పదవీకాలం 2024 ఏప్రిల్‌తో ముగిసింది. జిల్లా నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మరికొంతమందిని రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కాగా ఈ 3 పదవులను NDA కూటమి ప్రభుత్వం ఎవరికి ఇవ్వనుందో మరికొద్ది రోజులలో తెలియనుంది.
News November 27, 2024
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు.