News October 23, 2024
కృష్ణా: ఫీజు చెల్లింపుకు రేపే చివరి తేదీ
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
Similar News
News November 12, 2024
తిరువూరులో అర్ధరాత్రి విషాదం
తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.
News November 11, 2024
విజయవాడ: జనసేనలో చేరిన YCP కార్పొరేటర్లు
విజయవాడకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహుదూర్, ఆదిలక్ష్మి, రాజేశ్‌లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పవన్ సూచించారు.
News November 11, 2024
అగిరిపల్లి: 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
ఆగిరిపల్లిలోని ఆంధ్ర న్యూ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ అకాడమీలో నవంబర్ 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సోమవారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్, ఎమ్. శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14 బాల,బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరు కావాలన్నారు.