News July 19, 2024

కృష్ణా: బంగారం దోచుకెళ్లిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

గుడివాడకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి వద్ద గోల్డ్ చైన్ దొంగిలించిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావు(37)కు న్యాయస్థానం 3ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2022 ఫిబ్రవరిలో ఆమె కోదాడ వెళుతుండగా.. ఆమెతో మాటలు కలిపిన నిందితుడు మత్తుమందు ఇచ్చి బంగారం దోచుకున్నాడు. వృద్ధురాలు కేసు నమోదు చేయగా విజయవాడ పోలీసులు ఛార్జిషీట్ వేయగా, గురువారం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 

Similar News

News December 10, 2024

జగన్‌ వెంటే ఉంటా: MLC

image

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నిబంధనలు మేరకు నాకు రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సభ్యునిగా అవకాశం ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా. నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి జగన్’ అని ఆయన చెప్పారు.

News December 10, 2024

కృష్ణా: లా కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్-2024లో నిర్వహించిన పలు లా కోర్సుల పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు LLB, BA.LLB 2వ సెమిస్టర్ పరీక్ష L BA. LLB 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు KRU పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థులు ఫలితాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News December 10, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా సత్రాగచ్చి(SRC)- చెన్నై సెంట్రల్(MAS) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ AC ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.22807 SRC- MAS మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 10, 13, 17న, నం.22808 MAS- SRC రైలును ఈ నెల 12, 15, 19న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.