News June 22, 2024
కృష్ణా: బావపై కత్తితో దాడి చేసిన బావమరుదులు

తమ చెల్లెల్ని పుట్టింటికి పంపలేదన్న కోపంతో బావపై బావమరుదులు దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఆదర్శనగర్కు చెందిన అబ్దుల్లా భార్య పుట్టింటికి వెళతానని అడుగగా పంపలేదు. ఈ విషయాన్ని తన అన్నలకు చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు శనివారం అర్ధరాత్రి బావ అబ్దుల్లాపై కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్లాను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Similar News
News November 4, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
News November 4, 2025
జగన్ కాన్వాయ్ను అనుసరిస్తుండగా బైక్ ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న జగన్ కాన్వాయ్ను బైక్పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
News November 3, 2025
కృష్ణా : రేపటి నుంచి One Health డే వారోత్సవాలు

జిల్లాలో వారం రోజులపాటు One Health Day కార్యక్రమం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు One Health Day వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.


