News June 22, 2024

కృష్ణా: బావపై కత్తితో దాడి చేసిన బావమరుదులు

image

తమ చెల్లెల్ని పుట్టింటికి పంపలేదన్న కోపంతో బావపై బావమరుదులు దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఆదర్శనగర్‌కు చెందిన అబ్దుల్లా భార్య పుట్టింటికి వెళతానని అడుగగా పంపలేదు. ఈ విషయాన్ని తన అన్నలకు చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు శనివారం అర్ధరాత్రి బావ అబ్దుల్లాపై కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్లాను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Similar News

News November 12, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 14న SMVT బెంగుళూరు(SMVB)- మాల్డా(MLDT) మధ్య అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైలు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 14న ఉదయం 7 గంటలకు SMVBలో బయలుదేరి రాత్రి 8.05 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 16న ఉదయం 8 గంటలకు మాల్డా చేరుకుంటుందన్నారు. ఈ రైలులో 16 అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయన్నారు.

News November 12, 2024

కృష్ణా: బీటెక్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీటెక్ 1, 2, 3, 4వ ఏడాదికి సంబంధించిన రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News November 12, 2024

కృష్ణా: LLM కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్‌లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.