News August 26, 2024
కృష్ణా: బిరియాని ఇప్పించలేదని అన్నను హత్య చేసిన తమ్ముడు
విజయవాడలో బిరియాని ఒకరి ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిరియాని అడిగాడు. రాము బిరియాని ఇప్పించలేదని తమ్ముడు కిటికీ చెక్కతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2024
గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అంతరాయం.. గాల్లోనే విమానాలు
గన్నవరం విమానాశ్రయంలో శనివారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగుకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా, హైదరాబాదు నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టగా.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటకుపైగా గాల్లో ఉండి, తిరిగి హైదరాబాదుకు వెళ్లినట్లు సమాచారం.
News December 7, 2024
కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News December 7, 2024
కృష్ణా: 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్‌సైట్‌లో CAREERS ట్యాబ్ చూడవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.