News October 18, 2024
కృష్ణా: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 5, 6, 7, 8,11 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News November 17, 2025
EVM గోడౌన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News November 17, 2025
కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.