News November 16, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 26, 27, 28, 29 తేదీలలో బీఈడీ, నవంబర్ 26, 27, 28, 29, 30, డిసెంబర్ 2 తేదీలలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.

Similar News

News October 29, 2025

కృష్ణా: అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాను వణికించిన తుపాన్‌లివే.!

image

1968 నవంబర్‌లో వచ్చిన భారీ తుఫాన్ కృష్ణా జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబర్‌లో 180 కి.మీ వేగంతో వీచిన గాలుల తుఫాన్‌తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్ల్‌న్‌లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013 నీలం, పైలాన్ తుపాన్‌లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్‌హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.

News October 29, 2025

కృష్ణా: సర్వర్ డౌన్.. డిజిటల్ పేమెంట్స్‌కు అంతరాయం

image

జిల్లా పరిధిలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో తుపాను ప్రభావం కారణంగా డిజిటల్ పేమెంట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ లావాదేవీలు జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో వ్యాపారులు నగదు లావాదేవీలకే పరిమితమయ్యారు. విద్యుత్ అంతరాయాలు, నెట్‌వర్క్ సమస్యలు ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.

News October 29, 2025

నందిగామలో తుఫాను బీభత్సం.. రెండు ఇళ్లు ధ్వంసం

image

పెడన మండలం నందిగామపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా ఒక పెద్ద వృక్షం కూలి, రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదనంగా, మరో ఆరు ఇళ్లు, ఒక పశువుల పాక, రెండు ప్రహరీలు కూడా దెబ్బతిన్నాయని సర్పంచ్ చినబాబు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టారు.