News November 1, 2024
కృష్ణా: బీటెక్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ (Y20,Y21 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 25 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.
Similar News
News December 12, 2024
మచిలీపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం
రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.
News December 11, 2024
మచిలీపట్నం: పేర్ని నాని సతీమణిపై నమోదైన సెక్షన్లు ఇవే..
మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 11, 2024
VJA: ప్రయాణికులను మోసం చేస్తున్న నలుగురు అరెస్ట్
ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.