News April 6, 2024
కృష్ణా: బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికుల రద్దీ మేరకు విశాఖపట్నం(VSKP), తిరుపతి(SMVB) మధ్య నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.08543 VSKP-SMVB మధ్య నడిచే రైలును ఈ నెల 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం, నెం.08544 SMVB-VSKP మధ్య నడిచే రైలును ఏప్రిల్ 8 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ స్పెషల్ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News December 8, 2025
గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.
News December 8, 2025
సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోయిన మరో నిందితుడు

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగిపోగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.
News December 8, 2025
1.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం: జేసీ నవీన్

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి 29,866 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.502.50 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 72,98,622 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.


