News April 9, 2025

కృష్ణా: భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వండి- కలెక్టర్

image

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైన కలెక్టర్ CSR నిధుల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు నిధుల కొరత వలన సగంలో ఆగిపోయాయన్నారు.

Similar News

News December 12, 2025

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.

News December 12, 2025

దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

image

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

News December 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.