News May 27, 2024

కృష్ణా: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

ఎండల తీవ్రత నేపథ్యంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. నీటి లభ్యత లేని కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో టమాటా (కేజీ-రూ.40), వంకాయ (కేజీ- రూ.45), పచ్చిమిర్చి (కేజీ- రూ.80), బెండ (కేజీ -రూ.44), బీన్స్ (కేజీ రూ-180) ధరలు పలుకుతున్నాయి. మైలవరం, అవనిగడ్డ, నందిగామ, కంచిచర్ల, జగ్గయ్యపేట నుంచి వచ్చే టమాటా.. గుంటూరు జిల్లా నుంచి వచ్చే బెండ, దొండ, వంకాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News November 29, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో రేపు 4,70,210 మందికి పింఛన్లు

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,939,00,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 డిసెంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

News November 29, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల(2023- 24 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 4లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది. 

News November 29, 2024

తొలిరోజే 100శాతం పెన్ష‌న్ల పంపిణీ: క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ

image

డిసెంబ‌ర్ 1 ఆదివారం నేప‌థ్యంలో ముందు రోజే న‌వంబ‌ర్ 30న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీకి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. తొలిరోజే 100 శాతం పెన్ష‌న్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పంపిణీ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.