News October 15, 2024

కృష్ణా: భార్యా భర్తలకు 9 షాపులు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సజావుగా ముగిసింది. అయితే వ్యక్తిగతంగా షాపులు వరించిన వారి నుంచి జోరుగా బేరసారాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులు వేయొచ్చన్న నిబంధనలతో భారీగా సిండికేట్లగా ఏర్పడి షాపులు దక్కించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన భార్యభర్తలు నగరానికి చెందిన వారితో కలిపి 480 షాపులకు దరఖాస్తు చేస్తే ఈ సిండికేట్‌కు 9 దక్కాయి.

Similar News

News December 19, 2025

నేరాల నివారణే లక్ష్యం.. పోలీసుల గస్తీ

image

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు, ఏటీఎంలు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేస్తూ భద్రతపై నిఘా ఉంచారు. హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, ‘ఫేస్ వాష్ & గో’ కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ను ఆశ్రయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

News December 18, 2025

మచిలీపట్నం: తీర ప్రాంత రక్షణపై ఎంపీ బాలశౌరి కసరత్తు

image

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం కేంద్ర భూమి, శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌తో భేటీ అయ్యారు. కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, చిన్నగొల్లపాలెం తీరప్రాంత కోత నివారణపై చర్చించారు. దీనిపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి DPR సిద్ధం చేయాలని, నిధుల కోసం విపత్తు నిర్వహణ సంస్థలను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ఈ చర్యలతో తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించే అవకాశం ఉంది.

News December 18, 2025

20న గుణదలలో జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న గుణదలలో సీనియర్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా ఒరిజినల్ ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా కరేడులో డిసెంబర్ 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.