News May 25, 2024
కృష్ణా: మత్స్యకారులకు కీలక హెచ్చరికలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది సాయంత్రానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాను కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు హెచ్చరించారు. మే 26వ తేదీ రాత్రికి ఈ తుఫాన్ బంగ్లాదేశ్& పశ్చిమ బెంగాల్ మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని APSDMA స్పష్టం చేసింది.
Similar News
News February 15, 2025
పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 15, 2025
గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News February 14, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.