News February 10, 2025
కృష్ణా: ‘మద్యం దుకాణాల లాటరీ వాయిదా’

జిల్లాలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కల్లుగీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 12 దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించడం జరిగిందన్నారు. కోడ్ కారణంగా లాటరీ తీసే కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.
Similar News
News March 22, 2025
మచిలీపట్నం విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News March 21, 2025
మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 21, 2025
కృష్ణా: ‘రెడ్ బుక్‌తో ఏం చేయలేరు’

వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.