News October 15, 2024
కృష్ణా: మద్యం షాపుల లాటరీలో ఆసక్తికర విశేషాలు

➢ ఎన్టీఆర్ జిల్లాలో 20 మంది మహిళలకు దుకాణాలు
➢ పెనుగంచిప్రోలులోని 5 షాపుల్లో 3 షాపులు తెలంగాణ వారికే.
➢ పెనుగంచిప్రోలు పెట్రోల్ బంకులో పనిచేసే బాయ్‌కు షాపు.
➢ బాపులపాడుకు చెందిన పరుచూరి నరేశ్‌కు 4 షాపులు.
➢ గుడివాడకు చెందిన రామకృష్ణ మూడు షాపులు కైవసం
➢ మచిలీపట్నంలోని రెండు షాపులు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన వారికి దక్కాయి.
➢ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబంలోని వారికి విజయవాడలో రెండు షాపులు.
Similar News
News February 24, 2026
కృష్ణా: ప్రశాంతంగా ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 22,604 మంది విద్యార్థులకు గాను, 22,396 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళకుమారి తెలిపారు. 208 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
News February 24, 2026
కృష్ణా: మరి కాసేపట్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు

కృష్ణా(D)లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3 సిట్టింగ్, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News February 24, 2026
28న గన్నవరంలో జాబ్ మేళా

ఈనెల 28న ఉదయం 9 గంటలకు గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు సోమవారం తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-35 ఏళ్ల వయసున్నవారు పాల్గొనవచ్చన్నారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.


