News March 6, 2025
కృష్ణా: ‘మహిళ దినోత్సవ వేడుకలపై సమావేశం’

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకులపై కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్‌లో పలు శాఖాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. మార్చి 8వ తేదీన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, యంత్రాంగం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహణపై చర్చించారు.
Similar News
News March 16, 2025
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా SP ఆర్ గంగాధరరావు, క్షేత్రాధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 145 కేంద్రాలలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
News March 16, 2025
కృష్ణా జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

బర్డ్ ఫ్లూ ప్రభావం కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు, గన్నవరం పరిసర ప్రాంతాలలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పెద్ద బ్రాయిలర్ కేజీ రూ.200, చిన్న బ్రాయిలర్ రూ.180గా విక్రయిస్తున్నారు. అయితే ప్రజలు చికెన్ కంటే చేపల, మటన్ కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
News March 16, 2025
పది ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ ఛైర్‌పర్సన్

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్ హాలులో 1 నుంచి 7 వరకు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత జడ్పీ చైర్ పర్సన్ జడ్పీటీసీలు, జిల్లా అధికారులచే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.