News January 29, 2025

కృష్ణా: మహిళ వద్దకు నగ్నంగా వచ్చిన వ్యక్తికి జైలు శిక్ష

image

మహిళ వద్దకు నగ్నంగా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మచిలీపట్నం కోర్టు మంగళవారం జైలు శిక్ష విధించింది. బందరుకోటకు చెందిన మస్తాన్ 2022లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ మేరకు ఆమె మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కోర్టులో విచారణ జరిపి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.8వేలు జరిమానా విధించింది.

Similar News

News October 14, 2025

కృష్ణానది నుంచి నేరుగా రక్షిత తాగునీరు: ఎంపీ

image

జల్‌జీవన్ పథకం కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

News October 13, 2025

ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

image

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.

News October 13, 2025

మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్‌కు 32 అర్జీలు

image

కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 32 అర్జీలు అందాయి. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తప్పక పరిష్కార చర్యలు చేపడతామని అర్జీదారులకు తెలియజేశారు. చట్ట పరిధిలో పరిష్కార చర్యలు ఉంటాయన్నారు.