News March 8, 2025

కృష్ణా: మెగా DSC పరీక్షలకు ఆన్‌లైన్‌లో శిక్షణ

image

మెగా DSC రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు మచిలీపట్నంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News September 20, 2025

YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు!

image

తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

News September 20, 2025

స్వచ్ఛతాహి సేవపై కలెక్టర్ సమన్వయ సమావేశం

image

కలెక్టర్ డీ.కే. బాలాజి శుక్రవారం కలెక్టరేట్‌లోని “మీ-కోసం” సమావేశ హాల్‌లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలను సమన్వయంతో ముమ్మరంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కే. కన్నమ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జే.అరుణ, తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

కృష్ణా: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

కృష్ణా జిల్లా నూతన ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ న్యాయమూర్తికి మొక్కను అందజేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పరస్పర సహకారంతో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నేరస్తులకు త్వరితగతిన శిక్ష విధించేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఎస్పీ తెలిపారు.