News July 20, 2024

కృష్ణా యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

భారీ వర్షాలతో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కారణంగా శనివారం కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జరగనున్న పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన డిగ్రీ 5, 6వ స్పెషల్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 26న, ఫార్మ్-డీ 4వ ఏడాది పరీక్షలను ఈ నెల 22న నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది.

Similar News

News October 27, 2025

కృష్ణా: తీరప్రాంత ప్రజలకు మడ అడవులు రక్షణ కవచం.!

image

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంత ప్రజలకు రక్షణ కవచంలా మడ అడవులు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సహజ సంపద నేడు అంతరించిపోతున్న స్థితికి చేరుకోవడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో విపత్తు ప్రభావం తక్కువగా కనిపించిందని, అదేవిధంగా 2004 సునామీ సమయంలో కూడా ఈ మడ అడవులే సహజ రక్షణగా నిలిచాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.

News October 27, 2025

కృష్ణా: తుపాన్ బీభత్సం.. చిగురుటాకులా వణికిన దివిసీమ

image

‘మొంథా’ తుపాన్ ప్రభావం వల్ల దివిసీమ ప్రజలు కలవరపడుతున్నారు. గతంలో కృష్ణా జిల్లాను కకావికలం చేసిన 1977 తుపానును గుర్తుచేసుకుంటున్నారు. దీంతో దివిసీమ చిగురుటాకులా వణుకుతోంది. ఆ సంవత్సరం నవంబర్‌ 19న తుపాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొన్ని ఊర్లు సముద్రంలో కలిసిపోయాయి.

News October 27, 2025

మెుంథా తుఫాన్ ఇంకా ఎంత దూరం ఉందంటే.!

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.