News June 27, 2024
కృష్ణా: రామోజీరావు సభకు వచ్చేవారికి పార్కింగ్ ఎక్కడంటే..

అనుమోలు గార్డెన్స్లో జరిగే దివంగత రామోజీరావు సంస్మరణ సభకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. A1 గ్యాలరీ ప్రముఖుల వాహనాలు సభాప్రాంగణం సమీపంలోని సిద్దార్థ కాలేజీ, చైతన్య మహిళా కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. B1 గ్యాలరీకి చెందినవారి వాహనాలు కృష్ణవేణి స్కూల్స్ ఆవరణలో, ఇతర వాహనాలు సిద్దార్థ కళాశాల ఆవరణలో పార్క్ చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.
Similar News
News November 21, 2025
హనుమాన్ జంక్షన్: విద్యార్థినులకు వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్

హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో ఆకతాయిల హంగామా సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ ఆవరణలో తిరుగుతూ కాలేజీ విద్యార్థినులతో అసభ్యకరంగా, ఎగతాళిగా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన జంక్షన్ పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
News November 21, 2025
MTM: గోనె సంచుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచుల లభ్యత, నాణ్యతను పరిశీలించారు. అంతక ముందు గ్రామంలో ఇటీవల నిర్మించిన పంచాయతీ రాజ్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
News November 20, 2025
మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.


