News June 4, 2024

కృష్ణా: రాష్ట్రంలోనే టాప్‌లో సుజనా చౌదరి

image

ఏపీలో బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏడింటిలో ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులలో విజయవాడ పశ్చిమ MLA అభ్యర్థి సుజనా చౌదరి 10 రౌండ్లు ముగిసేసరికి 31,891 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ.. టాప్‌లో ఉన్నారు. మొత్తం పశ్చిమలో 19 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉండగా 10 రౌండ్లు పూర్తయ్యేసరికి సుజనా భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

Similar News

News November 18, 2025

కృష్ణా: క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్ల నిల్వలు

image

కృష్ణా జిల్లాలో ‘మీ డబ్బు-మీ హక్కు’ పేరుతో క్లెయిమ్ కాని డిపాజిట్లపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ డి.కె. బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 5.59 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సొమ్మును సరైన డిపాజిటర్లకు లేదా వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 17, 2025

వరకట్న వేధింపులు, మరణాలు అడ్డుకోవాలి: కలెక్టర్

image

వరకట్నం వల్ల జరిగే గృహహింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన తన ఛాంబర్‌లో వరకట్న నిషేధ చట్టం-1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.