News June 4, 2024
కృష్ణా: రాష్ట్రంలో 2వ స్థానంలో కేశినేని చిన్ని

రాష్ట్రంలో టీడీపీ కూటమి తరఫున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 2వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం చిన్ని 2,43,850 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా కూటమి ఎంపీ అభ్యర్థులలో నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,56,235 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు.
Similar News
News October 17, 2025
కృష్ణా: ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.
News October 17, 2025
ప్రసూతి మరణాల నివారణకి చర్యలు: కలెక్టర్

ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఛాంబర్‌లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రసూతి మరణాలపై సమీక్షించారు. మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News October 17, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండా అంశాలపై సమీక్షించిన కలెక్టర్, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.