News November 29, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల(2023- 24 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 4లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది. 

Similar News

News December 9, 2024

కృష్ణా: వరి రైతులకు APSDMA అధికారుల కీలక సూచనలు

image

కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తడిసిన వరి పనలు కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేయడం వల్ల నష్ట శాతాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేలా పిచికారీ చేయాలన్నారు.

News December 9, 2024

కృష్ణాజిల్లా రైతాంగానికి జాయింట్ కలెక్టర్ ప్రత్యేక విజ్ఞప్తి

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 10,11,12 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటను కోయకుండా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

News December 9, 2024

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం: కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాలతో పాటు మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు.