News February 13, 2025
కృష్ణా: రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్

జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 28, 2025
కృష్ణా: డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

యువత డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు హాజరై డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు.
News March 28, 2025
కృష్ణాజిల్లాలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ల నియామకం

కృష్ణాజిల్లాలో 4 మార్కెట్ యార్డుల ఛైర్మన్లను ప్రభుత్వం శుక్రవారం నియమించింది. గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పొట్లూరి రవి కుమార్ (టీడీపీ), కంకిపాడు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అన్నే ధనరామ కోటేశ్వరరావు(టీడీపీ), ఘంటసాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తోట కనకదుర్గ (జనసేన), మొవ్వ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దోనేపూడి శివరామయ్య (బీజేపీ) నియమితులయ్యారు.
News March 28, 2025
తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.