News August 14, 2024

కృష్ణా: రేపు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

image

విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం రానున్నారని ఆయన కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. రేపు ఉదయం 8:40కు రోడ్డు మార్గంలో ఉండవల్లి నుంచి 8:55కు ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంటారన్నారు. అలాగే 10:56 కు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉండవల్లి స్వగృహానికి చేరుకుంటారన్నారు. అలాగే 12:10 కి ఉండవల్లి హెలీప్యాడ్ ద్వారా గుడివాడ వెళ్లి అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.

Similar News

News September 15, 2024

తిరువూరులో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

image

తిరువూరులోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కూలీ పని నిమిత్తం చెట్టు ఎక్కి కొమ్మలను నరికే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఈక్రమంలో గేటుకి ఉన్న స్తూపం దిగబడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మునకుళ్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

విస్సన్నపేట: బాలికపై హత్యాచారం

image

విస్సన్నపేటలో శనివారం పైశాచికత్వం బయటపడింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శివయ్య (40) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో (సెక్షన్4)పోక్సో యాక్ట్ 64(1) BNS, కేసు నమోదు చేశామని తిరువూరు సీఐ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News September 15, 2024

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో ప్రథమ స్థానంలో ‘కృష్ణా’

image

జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6363 వివిధ రకాల పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో 5413 క్రిమినల్ కేసులు ఉండగా 181 సివిల్, 484 చెక్ బౌన్స్ కేసులు, 85 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని జిల్లా జడ్జి అరుణ సారెక తెలిపారు.