News June 21, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా డిబ్రుగఢ్(DBRG)-కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.22504 DBRG-CAPE ట్రైన్‌ను జూలై 8 నుంచి నం.22503 CAPE-DBRG ట్రైన్‌ను జూలై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

Similar News

News November 21, 2025

MTM: గోనె సంచుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచుల లభ్యత, నాణ్యతను పరిశీలించారు. అంతక ముందు గ్రామంలో ఇటీవల నిర్మించిన పంచాయతీ రాజ్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

News November 20, 2025

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

image

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

News November 20, 2025

కృష్ణా: ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి లభించింది. పలు మండలాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, ఏఓ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.