News July 18, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో స్టాప్‌లు ఇచ్చామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07866 విజయవాడ-మచిలీపట్నం ట్రైన్‌కు ఈ నెల 21 నుంచి ఉప్పులూరులో, నం.17281 గుంటూరు-నరసాపురం ట్రైన్‌కు ఈ నెల 20 నుంచి పుట్లచెరువులో స్టాప్ ఇచ్చామన్నారు. ఈ స్టాప్‌ల కారణంగా ఆయా ట్రైన్లు బయలుదేరే సమయాలలో మార్పులు లేవని రైల్వే అధికారులు చెప్పారు.
Similar News
News December 5, 2025
ఉయ్యూరు కేసీపీలో క్రషింగ్ షురూ

ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించిన చెరకు క్రషింగ్‌ను గురువారం రాత్రి యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్‌లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు టన్ను ధర రూ.3,690గా యాజమాన్యం నిర్ణయించింది.

కృష్ణా: గోనె సంచుల కొరతపై సీఎస్ అరా

ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో నెలకొన్న గోనె సంచుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అరా తీశారు. ధాన్యం సేకరణపై గురువారం ఆయన రాష్ట్ర సచివాలయాల నుంచి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లాలో కోటి గోనె సంచుల అవసరాన్ని గుర్తించగా ఇప్పటికే 50 లక్షలు రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గోనె సంచుల సరఫరాకు సహకరించాలని సీఎస్‌ను కోరారు.