News August 26, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ సెప్టెంబర్ 2, 9, 16, 23వ తేదీలలో ఏలూరు మీదుగా కాకుండా నిడదవోలు- భీమవరం- గుడివాడ మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 14, 2025
విజయవాడలో అండర్-19 బాడ్మింటన్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలోని బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలన్నారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 14, 2025
కృష్ణానది నుంచి నేరుగా రక్షిత తాగునీరు: ఎంపీ

జల్‌జీవన్ పథకం కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.