News September 20, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
విజయవాడ, గుడివాడ మీదుగా తిరుపతి(TPTY)- బిలాస్పూర్ (BSP) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరులో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొవ్వూరులో ఇచ్చిన స్టాప్‌ను ఈ నెల 21 నుంచి పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17481 BSP-TPTY రైలు ఈ నెల 21 నుంచి, నం.17482 TPTY-BSP రైలు ఈ నెల 22 నుంచి కొవ్వూరులో ఆగుతుందన్నారు.
Similar News
News October 9, 2024
విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్ UPDATE
అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన నాగరాజు మంగళవారం BRTSరోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని భార్య ఉష ఉరేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. గుణదల కుమ్మరి బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై భానునగర్ నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్లో వెళుతూ నాగరాజు బైక్‌ను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఉష పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
News October 9, 2024
జగన్ కుట్రలకు ఫలితమే 11 సీట్లు: ఉమా
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడిన ఘటనకు ప్రతిఫలంగా ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పది రోజులు విజయవాడలో ఉండి వరద బాధితులను ఆదుకుంటే, ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు.
News October 8, 2024
విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్
విజయవాడలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అజిత్ సింగ్ నగర్‌కు చెందిన నాగరాజు ప్రసాదంపాడులో వంట మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బీఆర్టీఎస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నాగనాజు భార్య ఉష ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.