News November 2, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త
విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- కొల్లామ్(QLN) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08539/08540 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08539 VSKP- QLN రైలును నవంబర్ 6 నుంచి 27 వరకు, నం.08540 QLN- VSKP రైలును NOV 7 నుంచి 28 వరకు ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.
Similar News
News December 2, 2024
కృష్ణా: NMMS పరీక్ష హాల్ టికెట్లు విడుదల
8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(NMMS) టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 8న మొత్తంగా 180 మార్కులకు ఈ పరీక్ష జరగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://portal.bseap.org/APNMMSTFR/frmDownloadNmmsHT_C.aspx అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
News December 1, 2024
కృష్ణా: రేపటితో ముగియనున్న గడువు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపటిలోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News December 1, 2024
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక ప్రకటన
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయి అమ్మిన సరఫరా చేసిన వారితో సత్సంబంధాలు కొనసాగించిన గంజాయ్ షీట్ తెరుస్తామని సెంటర్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. విజయవాడలో నేడు ఆయన మాట్లాడుతూ.. గంజాయి విషయంలో ఒక కేసుకు మించి ఎన్ని కేసులున్నా రౌడీషీటు తెరుస్తామని స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందవంటూ హెచ్చరించారు.