News November 9, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

నూజివీడు- వట్లూరు సెక్షన్‌లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.08567 విశాఖపట్నం- విజయవాడ జనసాధారణ్ రైలును అధికారులు దారి మళ్లించారని తెలిపారు. ఈ నెల 13న ఈ రైలు గన్నవరం- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ- భీమవరం టౌన్ మీదుగా నిడదవోలు చేరుకుంటుందన్నారు. రైలు ప్రయాణికులు గమనించాలని కోరుతూ అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 5, 2025

పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

image

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.

News December 5, 2025

ఉయ్యూరు కేసీపీలో క్రషింగ్‌ షురూ

image

ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించిన చెరకు క్రషింగ్‌ను గురువారం రాత్రి యూనిట్‌ హెడ్‌ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్‌లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు టన్ను ధర రూ.3,690గా యాజమాన్యం నిర్ణయించింది.