News April 6, 2024
కృష్ణా: రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి

దమ్మపేట మండలం మందలపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన చీపు లక్ష్మి(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ(35)కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 17, 2025
వరకట్న వేధింపులు, మరణాలు అడ్డుకోవాలి: కలెక్టర్

వరకట్నం వల్ల జరిగే గృహహింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన తన ఛాంబర్లో వరకట్న నిషేధ చట్టం-1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.

కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.