News September 26, 2024
కృష్ణా: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై గురువారం అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వారు వాహనదారులను హెచ్చరించారు.
Similar News
News December 21, 2025
కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
News December 21, 2025
కృష్ణా: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
బందరు – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు

పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.


