News December 15, 2024
కృష్ణా: లా కోర్సు రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన బీఏ.ఎల్‌ఎల్‌బీ 6వ సెమిస్టర్ పరీక్షలకు2023- 24 విద్యా సంవత్సరం రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షల రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 17లోపు ఒక్కో పేపరుకు ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని KRU తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని పేర్కొంది.
Similar News
News January 20, 2025
కైకలూరు: పాత కక్షలతో హత్య.. పట్టుకున్న పోలీసులు
పాత కక్షల కారణంగా పథకం ప్రకారం కాపుకాసి హత్య చేసిన నిందితుడు బోధనపు శ్రీనివాసరావును అరెస్టు చేసారని ఏలూరు డీఎస్పీ డి. శ్రావణకుమార్ తెలిపారు. ఆదివారం కైకలూరు సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. కొన్నిరోజుల క్రిందట కలిదిండి మండలం సంతోషపురం గ్రామ మాజీ సర్పంచ్ కాలువ నల్లయ్య హత్యకు గురయ్యారు. విచారణ చేపట్టి తక్కువ సమయంలో ఈ కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.
News January 20, 2025
విజయవాడలో యువకుడి ఆత్మహత్య
విజయవాడ నగరంలోని రాధనగర్‌లో శనివారం వాచ్‌మెన్ గొర్లి శివ (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శివను యజమాని పిలువగా పలకలేదు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News January 20, 2025
విజయవాడ మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయవాడ మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.