News September 29, 2024
కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News October 5, 2024
కృష్ణా: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.
News October 5, 2024
నేడు పార్టీ అధిష్ఠానం వద్దకు కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.
News October 5, 2024
విజయవాడ: నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి దర్శనం
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు శనివారం శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమై, జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నపూర్ణమ్మను పూజిస్తే ఆకలిదప్పుల బాధలు ఉండవని తెలిపారు.