News August 2, 2024
కృష్ణా: వందేభారత్ ప్రయాణికులకు తీపి కబురు
విజయవాడ మీదుగా సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు (నం.20833, 20834) సామర్లకోటలో ఇచ్చిన హాల్ట్‌ను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సామర్లకోటలో వందేభారత్‌కు ప్రయోగాత్మకంగా హాల్ట్ ఏర్పాటు చేయగా, దాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News September 21, 2024
కృష్ణా: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y22 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 30 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News September 21, 2024
తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు తిరుపతి(TPTY)-విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ నం.22708 TPTY-VSKP రైలును ఈ నెల 29న, నం.22707 VSKP-TPTY రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News September 21, 2024
‘యూపీఎస్సీ మెయిన్స్‌కు 128 మంది హాజరు’
ఎస్‌ఆర్‌ఆర్&సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన యూపీఎస్సీ మెయిల్ పరీక్షకు ఏడుగురు గైర్హాజరైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. 135 మంది అభ్యర్థులకు గానూ 128 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పటిష్ట బందోబస్తు నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులకు అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తున్నామన్నారు.