News December 9, 2024

కృష్ణా: వరి రైతులకు APSDMA అధికారుల కీలక సూచనలు

image

కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తడిసిన వరి పనలు కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేయడం వల్ల నష్ట శాతాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేలా పిచికారీ చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.

News November 21, 2025

హనుమాన్ జంక్షన్: విద్యార్థినులకు వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్

image

హనుమాన్ జంక్షన్ ఆర్‌టీసీ బస్టాండ్ పరిధిలో ఆకతాయిల హంగామా సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ ఆవరణలో తిరుగుతూ కాలేజీ విద్యార్థినులతో అసభ్యకరంగా, ఎగతాళిగా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన జంక్షన్ పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

News November 21, 2025

MTM: గోనె సంచుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచుల లభ్యత, నాణ్యతను పరిశీలించారు. అంతక ముందు గ్రామంలో ఇటీవల నిర్మించిన పంచాయతీ రాజ్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.