News July 13, 2024
కృష్ణా: వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పంటలకు తోడు మాగాణి పంటల సాగుకు, వరి నారుమళ్లు పోయటానికి రైతులు సిద్దమవుతున్న తరుణంలో వర్షాల రాక ఊరట కలిగించిందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలో కురిసే ఈ వానలతో విత్తనాలు మొలకెత్తి పంటలు ఏపుగా పెరిగి దిగుబడి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
కృష్ణా: గోనె సంచుల కొరతపై సీఎస్ అరా

ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో నెలకొన్న గోనె సంచుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అరా తీశారు. ధాన్యం సేకరణపై గురువారం ఆయన రాష్ట్ర సచివాలయాల నుంచి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లాలో కోటి గోనె సంచుల అవసరాన్ని గుర్తించగా ఇప్పటికే 50 లక్షలు రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గోనె సంచుల సరఫరాకు సహకరించాలని సీఎస్‌ను కోరారు.

News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్‌లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.