News December 30, 2024

కృష్ణా: వాయిదా పడిన పీజీ పరీక్షలు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2025 జనవరి 4న జరగనున్న పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. 3,4వ తేదీలలో మచిలీపట్నంలో “యువకెరటాలు” కార్యక్రమం జరగనున్నందున జనవరి 4న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 21న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా జనవరి 3న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20న నిర్వహిస్తామని పేర్కొంది. 

Similar News

News December 5, 2025

‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

image

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.

News December 5, 2025

ఈ నెల 8న కృష్ణా వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు.

News December 5, 2025

సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

image

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.