News March 4, 2025

కృష్ణా: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

image

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News March 4, 2025

కృష్ణా: తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

News March 4, 2025

కృష్ణా: అప్పుడు వెనక్కి తగ్గారు.. ఇప్పుడు విజయం సాధించారు

image

గత అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఆలపాటి MLC ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పట్టభద్రుల మద్దతుతో అఖండ విజయం సాధించారు.

News March 4, 2025

తడి,పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ 

image

తడి,పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ బాలాజీ అన్నారు. సోమవారం మచిలీపట్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎండీవోలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొంతమంది తడి,పొడి చెత్తను కలిపి ఇస్తున్నారని, దీనిపై పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన లేనట్లనిపిస్తుందని, ప్రజలకు సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. 

error: Content is protected !!