News March 4, 2025

కృష్ణా: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

image

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News March 19, 2025

గన్నవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై కోల్కతా హైవేపై బైక్‌-కారు ఢీ కొన్నాయి . ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరపనేని గూడేనికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (55)ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2025

పెనుగంచిప్రోలు ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడి వ్యక్తి మృతి

image

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడిపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వత్సవాయి మండలం కొత్త వేమవరంకు చెందిన గింజుపల్లి సాయి మణికంఠగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 18, 2025

కృష్ణా: లబ్ధిదారుల పురోభివృద్ధికి తోడ్పడండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వారి పంట మీద తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు.

error: Content is protected !!